ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డల్ నోట్ లో ప్రారంభమైన రణవీర్ 'జయేష్‌భాయ్ జోర్దార్'

cinema |  Suryaa Desk  | Published : Sat, May 14, 2022, 02:42 PM

'అర్జున్ రెడ్డి' సినిమా విడుదలైన తర్వాత షాలినీ పాండే టాలీవుడ్ లో ఒక సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో ఈ బబ్లీ బ్యూటీ ఫుల్ ఫేమస్ అయ్యింది కానీ తెలుగులో మాత్రం ఆఫర్స్ రాబట్టలేకపోయింది. ఈ బ్యూటీ బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో ఒక సినిమా ఛాన్స్ కొట్టేసింది. యష్ రాజ్ ఫిల్మ్స్ 'జయేష్ భాయ్ జోర్దార్' సినిమా కోసం షాలిని పాండే ని సెలెక్ట్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసింది. తాజాగా ఇప్పుడు, ఈ చిత్రం విడుదలై చాలా డల్ రివ్యూలు అందుకుంటుంది. చాలా ఏరియాల్లో ఆక్యుపెన్సీ కూడా తక్కువగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa