టాలీవుడ్ టాప్ హీరోస్ త్రయం మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఈ మధ్య ఎక్కువగా కలిసి కనిపిస్తున్నారు. పార్టీస్‌లోనో లేదంటే ఏదైన అకేషన్‌లోనో ఈ ముగ్గురు హీరోల సందడి ఓ రేంజ్‌లో ఉంటుంది. ఫ్యామిలీస్‌తో కలిసి మరీ పార్టీలకి హాజరవుతున్న వీరు కలిసి ఫోటోలకి ఫోజులిస్తున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోతున్నాయి. భరత్ అనే నేను మూవీ ఆడియో వేడుక తర్వాత పలు సందర్భాలలో కలిసిన ముగ్గురు హీరోలు తాజాగా వంశీ పైడిపల్లి బర్త్‌డే వేడుకలో కలిసారు. ఈ ముగ్గురి హీరోలతో వంశీ పైడిపల్లి ఫోటో దిగాడు. ప్రస్తుతం ఈ ఫోటో అభిమానులని ఆకట్టుకుంటుంది. ఈ ముగ్గురు హీరోలతో కలిసి వంశీ పైడిపల్లి మల్టీ స్టారర్ చిత్రాన్ని చేయాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం వంశీ- మహేష్ కాంబినేషన్‌లో మూవీ రూపొందుతుండగా త్వరలో చెర్రీ- జూనియర్ ఎన్టీఆర్ కలిసి మల్టీ స్టారర్ చేయనున్నారు. ఈ సినిమా 250 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ అరవింద సమేత చిత్రంతో బిజీగా ఉండగా చెర్రీ .. బోయపాటి సినిమా చేస్తున్నారు. మరి టాప్ స్టార్స్ త్రయంతో సినిమా ఎప్పుడు తెరకెక్కుతుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa