విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ విక్రమ్. ఈ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు. వర్సటైల్ యాక్టర్స్ విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కీ రోల్స్ ప్లే చేసారు. ఈ సినిమాలో హీరో సూర్య అతిధి పాత్రలో నటిస్తున్నారని ఇటీవలే దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఎనౌన్స్ చేసారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న థియేటర్లలో విడుదల కాబోతుంది. తమిళ, తెలుగు, హిందీ భాషలలో రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేసే హక్కులను ప్రముఖ టాలీవుడ్ హీరో నితిన్ కొనుక్కున్నారు. విక్రమ్ తెలుగు ట్రైలర్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ విడుదల చేసారు.
తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ ఏ సెర్టిఫికెట్ పొందింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో మొత్తం 400 కు పైగా థియేటర్లలో కమల్ హాసన్ విక్రమ్ సందడి చేయనుంది. త్వరలోనే హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa