ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ లు కలిసి నటించిన పాన్ ఇండియా చిత్రం 'ఆర్ ఆర్ ఆర్'. మార్చి 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను కొల్లగొడుతుంది. ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాలో ఆలియా భట్, అజయ్ దేవగణ్, ఒలీవియా మోరిస్, శ్రియా శరణ్ కీలక పాత్రలు పోషించారు.
థియేటర్లలో యాభై రోజులు పూర్తి చేసుకున్న తెలుగు చిత్రం గా 'ఆర్ ఆర్ ఆర్' పేరు తెచ్చుకుంది. మే 20 నుండి ప్రముఖ జీ 5 ఓటిటిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో స్ట్రీమింగ్ అవుతున్న ఆర్ ఆర్ ఆర్ హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. కేవలం పది రోజుల వ్యవధిలోనే తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషలలో కలుపుకుని మొత్తం 1000 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలతో దూసుకుపోతూ సంచలనం రేపుతోంది. ప్రస్తుతం జీ 5 #1 ట్రెండింగ్ స్థానంలో ఆర్ ఆర్ ఆర్ స్ట్రీమింగ్ అవుతుంది.