బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పై కృష్ణజింకల కేసు నడుస్తున్న విషయం అందరికి తెలిసిందే. 1990లనుండి మొదలైన ఈ కేసు ఇప్పటివరకు నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ఈ కేసు విషయమై సల్మాన్ పలుమార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఇదిలా ఉంటె, కృష్ణజింకలను వేటాడిన సల్మాన్ ను లారెన్స్ బిష్ణోయ్ అనే వ్యక్తి రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో కాల్చి చంపుతామని, అయితే, ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నాలేవీ జరగలేదని, మున్ముందు జరుగుతాయని బిష్ణోయ్ ప్రకటించాడు. తాజాగా సోమవారం నాడు పంజాబీ సింగర్ కమ్ పొలిటీషియన్ సిద్ధూ మూసే వాలా ను ఎవరో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఇతన్ని కాల్చి చంపింది లారెన్స్ బిష్ణోయ్ అని పోలీసులు ప్రైమ్ సస్పెక్టు చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో బిష్ణోయ్ నుండి బెదిరింపులనెదుర్కొన్న సల్మాన్ ప్రాణాలకు హాని పొంచి ఉందని భావించిన పోలీసులు సల్మాన్ సెక్యూరిటీని పెంచారు. అతని అపార్టుమెంటు చుట్టూరా పోలీసుల నిఘా ఉంచారు.