లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో "విక్రమ్" సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్ దాస్ అండ్ శివాని నారాయణన్ సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అతిధి పాత్రలో కనిపించనున్నాడు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'విక్రమ్' సినిమా జూన్ 3, 2022న థియేటర్లలో విడుదల కానుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టిక్కెట్ ధరల విషయంలో 'విక్రమ్' మూవీ మేకర్స్ కూడా మేజర్ టీమ్ బాటలో వెళ్తున్నటు వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీలో టిక్కెట్ ధర 177 కాగా, తెలంగాణలో 200 కి లాక్ చేసినట్లు సమాచారం. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ అండ్ ఆర్ మహేంద్రన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.