రానా హీరోగా నటించిన సినిమా 'విరాటపర్వం'. ఈ సినిమాలో హీరోయినిగా సాయి పల్లవి నటించింది. ఈ సినిమాకి వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. తాజాగా విరాటపర్వం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అపశ్రుతి జరిగింధి. కర్నూలులోని డీఎస్‌ఏ గ్రౌండ్‌లో ఆదివారం సాయంత్రం ఈ కార్యక్రమం నిర్వహిస్తుండగా ఈదురు గాలులు వీచాయి. అయితే వేదిక వెనుక ఉన్న ఎల్ ఈడీ స్క్రీన్ కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఆ సమయంలో చిత్రబృందంలోని ఎవరూ వేదికపై లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa