ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో అందరూ ఎదురుచూస్తున్న సినిమాల్లో ఈ ప్రాజెక్ట్ ఒకటి. తాజాగా ఇప్పుడు ఈ చిత్రానికి 'అసురుడు' అనే టైటిల్ ని పెట్టాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి మూవీ మేకర్స్ నుండి ఎలాంటి ప్రకటన లేనప్పటికీ ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లో హల చల్ చేస్తుంది. కొరటాల శివతో చేస్తున్న 'NTR30' మూవీ కంప్లీట్ అయ్యాక ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారని కూడా మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa