తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ సర్కార్ ‘. పొలిటికల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఐతే ఇటీవలే ఈ చిత్రం టాకీ పార్ట్ ను పూర్తి చేసుకుంది. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఇంక చిత్రీకరణకు ఒక్క పాట మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ పాట షూటింగ్ కోసమే చిత్ర బృందం అమెరికా వెళ్లిందట. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఈ పాటను షూట్ చేయనున్నారు.
కాగా ఈ చిత్ర కథ రైతులకు సంబంధించినదని వారి పరిస్థితులను ఇందులో చూపించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో విజయ్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు చిత్రీకరించబోయే పాట కూడా వీరిద్దరి మీదేనట. దాంతో కీర్తిసురేష్ తో అమెరికాలో స్టెప్స్ వేయనున్నాడు విజయ్. అలాగే మరో హీరోయిన్ వరలక్ష్మి కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ ‘సర్కార్’ చిత్రం విడుదలకానుంది. ఇక ఈ చిత్రం తరువాత విజయ్ తనకు ‘తేరి, మెర్సల్ ‘లాంటి విజయవంతమైన చిత్రాలను అందించిన యువ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో నటించనున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa