టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నటసింహ నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. ఈ కాంబినేషన్ లో రానున్న సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని రోజుల క్రితం, ఈ చిత్రంలో బాలయ్య కూతురిగా బెంగళూరు బ్యూటీ శ్రీలీల నటిస్తుందని అనిల్ స్వయంగా వెల్లడించాడు. తాజాగా ఇప్పుడు, ఈ చిత్రంలో అంజలి కీలక పాత్రలో కనిపించనుంది అని ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య ప్రస్తుతం తను చేస్తున్న సినిమాల షూటింగ్ కంప్లీట్ చేసాక ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభమవుతుంది అని సమాచారం. ప్రస్తుతం బాలకృష్,ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'NBK107' సినిమాతో బిజీగా ఉన్నారు.