కమల్ హాసన్ నటించిన విక్రమ్ చిత్రానికి సంబంధించిన కలెక్షన్ల హావా ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నది. ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే 200 కోట్ల కలెక్షన్లను సాధించడం రికార్డుగా ట్రేడ్ వర్గాలు చెప్పుకొంటున్నాయి. అత్యంత వేగంగా 200 కోట్లు సాధించిన తమిళ ఐదు చిత్రాల్లో విక్రమ్ ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు 5వ రోజు ఎంత వసూలు చేసిందంటే. ఓవర్సీస్‌లో విక్రమ్ కలెక్షన్ల తుఫాన్ భారీగా కనిపిస్తున్నది. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమాకు భారీ స్పందన కనిపిస్తున్నది. ఈ చిత్రం 5వ రోజు 357 లొకేషన్లలో 110k డాలర్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 2 మిలియన్ల డాలర్లు కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు అమెరికాలో 2,004, 271 డాలర్లు రాబట్టింది. ఏపీ, తెలంగాణలోఇక ఏపీ, తెలంగాణలో విక్రమ్ వసూళ్ల దూకుడు ప్రదర్శిస్తున్నది. విజయవాడ, వైజాగ్, ఉత్తరాంధ్ర, సీడెడ్, నైజాంలో భారీ వసూళ్లను సాధిస్తున్నది. తాడేపల్లిగూడెంలో విక్రమ్ 5వ రోజున 1 లక్ష వసలు చూసింది. దాంతో ఈ సినిమా షేర్ 5 లక్షలకు చేరుకొన్నది.
కర్నూలు సిటీలో మేజర్ చిత్రం 3 లక్షల గ్రాస్ వసూలు చేసింది. దాంతో ఇప్పటి వరకు 27 లక్షలు వసూలు చేసినట్టు అయింది. నంద్యాలలో ఈ చిత్రం 1. 5 లక్షల గ్రాస్ రాబట్టింది. దాంతో 10 లక్షల గ్రాస్‌ను నమోదు చేసింది. మిగితా ప్రాంతాల నుంచి వసూళ్ల వివరాలు అందాల్సి ఉంది. తమిళనాడులో 100 కోట్లకు చేరువగాతెలుగు రాష్ట్రాల్లో విక్రమ్ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించింది. నాలుగు రోజుల్లో ఆంధ్రా, నైజాంలో ఈ సినిమా 8 కోట్ల షేర్, 14. 5 కోట్ల గ్రాస్ నమోదు చేసింది. అయితే ఐదో రోజున 2. 5 కోట్ల వసూళ్లతో 17 కోట్ల గ్రాస్‌ను నమోదు చేసింది.