మరో ప్రేమ కథా చిత్రానికి శ్రీకారం చుట్టాడు దర్శకుడు శేఖర్‌కమ్ముల. ఈ చిత్రం ద్వారా ప్రముఖ నటుడు విక్రం తనయుడు ధృవ్ ను తెలుగుతెరకు పరిచయం చేస్తున్నాడు. విశేషం ఏమిటంటే ఈ సినిమాలో సాయిపల్లవిని హీరోయిన్‌గా తీసుకుంటున్నారట. శేఖర్ ఆమెకు కథను వినిపించడం.. ఆమె ఓకే చెప్పడం జరిగిపోయాయని, ఇక డేట్స్ కేటాయించడమే తరువాయని సమాచారం. మరో విశేషం ఏమిటంటే, ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. అక్టోబర్ నుంచి దీని షూటింగ్ జరుగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa