ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఊరమాస్ యాక్షన్, పవర్ఫుల్ డైలాగులతో బాలయ్య ఫస్ట్ హంట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 09, 2022, 09:55 PM

జూన్ 10 వ తేదీన అంటే రేపు నటసింహం బాలకృష్ణ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ రోజు NBK 107 టీం మూవీ టీజర్ ను ఫస్ట్ హాంట్ పేరిట విడుదల చేసింది. కొంచెం సేపటి క్రితమే విడుదలైన ఈ టీజర్ మాములుగా లేదు. బాలయ్య పవర్ ఫుల్ డైలాగులకు, యాక్షన్ ప్యాక్డ్ సీన్లకు నందమూరి అభిమానులకు పూనకాలు తప్పవనిపిస్తుంది. తమన్ మ్యూజిక్ బాలయ్య మాస్ అవతార్ ను మరింత ఎలివేట్ చేసేలా ఉంది. ఈ టీజర్ తో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. బాలయ్య పుట్టినరోజు కానుకగా మాస్ ట్రీట్ ను ఇచ్చినందుకు డైరెక్టర్ గోపీచంద్ మలినేనికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. ఐతే , ఈ వీడియోలో చిన్న లోటు ఏంటంటే... మూవీ టైటిల్ ను రివీల్ చెయ్యలేదు. 


క్రాక్, అఖండ సినిమాల బ్లాక్ బస్టర్ ల తర్వాత డైరెక్టర్ గోపీచంద్ మలినేని, బాలకృష్ణ ల నుండి రానున్న సినిమా కావడంతో అభిమానుల అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇందులో శ్రుతిహాసన్ కధానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్, మలయాళ స్టార్ ఆర్టిస్ట్ దునియా విజయ్ ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది దసరా కానుకగా ఈ సినిమా విడుదలకాబోతుందని ప్రచారం జరుగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com