టాలీవుడ్ యంగ్ ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్ త్వరలోనే "గాడ్సే" గా ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అంతకుముందు సత్యదేవ్ నటించిన "బ్లఫ్ మాస్టర్" ను తెరకెక్కించిన గోపి గణేష్ పట్టాభి గాడ్సే సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించారు. ఇందులో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించింది. CK స్క్రీన్స్ పతాకంపై సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 17న విడుదలకావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేసిన చిత్రబృందం తాజాగా ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ మేరకు జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సత్యదేవ్ మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముందుగా డైరెక్టర్ గోపి గణేష్ ఈ స్టోరీని తనకు చెప్పినప్పుడు, లీడ్ రోల్ లో ఎవరైనా బిగ్ స్టార్ నటిస్తే బావుంటుందని అనుకున్నాడట. బిగ్ స్టార్స్ ముఖ్యం కాదు మనమెంత నిజాయితితో పని చేస్తున్నామన్నది ముఖ్యం అని చెప్పి గాడ్సే లో నటించడానికి గోపి గణేష్ సత్యదేవ్ ను ఒప్పించారట. ఇందులో హీరోయిన్ కు, తనకు కాంబో సీన్స్ ఉండవని, డిజిటల్ మీడియాతోనే ఇద్దరం మాట్లాడుకుంటామని చెప్పారు. ఈ సినిమాలో నటించిన ఐశ్వర్య లక్ష్మిని సత్యదేవ్ యంగ్ విజయశాంతి గా పేర్కొన్నారు. బ్లఫ్ మాస్టర్ సినిమాను థియేటర్లో చూడలేకపోయామని తనకు చాలామంది చెప్పారని, ఈ సారి అదే కాంబోలో వస్తున్న గాడ్సే ను థియేటర్లో చూడటం మాత్రం మర్చిపోవద్దని సత్యదేవ్ చెప్పారు.