నాచురల్ స్టార్ నాని నటించిన కొత్త చిత్రం 'అంటే సుందరానికి'. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో మలయాళ ముద్దుగుమ్మ నజ్రియానాజిమ్ హీరోయిన్ గా నటిస్తుంది. వివేక్ సాగర్ సంగీతమందించిన ఈ చిత్రం జూన్ 10న అంటే రేపు విడుదల కాబోతుంది. ఈ రోజు రాత్రి నుండే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు పడనున్నాయి. వినూత్నమైన సబ్జెక్టుతో తెరకెక్కిన అంటే సుందరానికి మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటి నుండి ప్రమోషన్స్ చేస్తూ ప్రేక్షకుల్లో తగినంత బజ్ తీసుకొచ్చింది.
ఇరు తెలుగు రాష్ట్రాలలో ఈ మూవీ బిజినెస్ భారీగా జరిగిందని తెలుస్తుంది. ఆ లెక్కలు ఎలా ఉన్నాయంటే, నైజాం లో రూ. 10కోట్లు, సీడెడ్ లో రూ. 4 కోట్లు, ఆంధ్రప్రదేశ్ మిగిలిన ప్రాంతాల్లో రూ. 10 కోట్లు మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో అంటే సుందరానికి మూవీ రూ. 24 కోట్ల బిజినెస్ జరుపుకుంది. ఈ మూవీకి ఓవర్సీస్ లో రూ. 3.5కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ. 2. 5 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రూ. 30 కోట్ల బిజినెస్ జరుపుకున్న అంటే సుందరానికి చిత్రం రూ. 31 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగబోతుంది.