2008 ముంబై దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా, శశికిరణ్ తిక్కా" మేజర్" చిత్రాన్ని రూపొందించారు. లీడ్ రోల్ లో అడవి శేష్ నటించటంతో పాటు ఈ చిత్రానికి రచయితగాను పనిచేసారు. సయీ మంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ల హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇండియా, GMB ఎంటర్టైన్మెంట్స్,A +S మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గత శుక్రవారం విడుదలైన మూవీకి ప్రేక్షకుల నుండే కాక పలువురు సినీ సెలెబ్రిటీల నుండి కూడా విశేష్ స్పందన వస్తుంది. ఇండియాతో పాటు అమెరికాలో కూడా భారీగా విడుదలైన ఈ చిత్రం యూ ఎస్ లో 1మిలియన్ మార్కును అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా 600 స్క్రీన్స్ తో 325 లొకేషన్లలో విడుదలైన మేజర్ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అధిగమించి ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తుంది. హీరోగా శేష్ కు తొలి 1 మిలియన్ డాలర్ మూవీ ఇదే కావడం విశేషం.