బ్రాహ్మణ యువకుడు సుందరం పాత్రలో నాని, క్రిస్టియన్ యువతి లీలా థామస్ పాత్రలో నజ్రియా నటిస్తున్న చిత్రం అంటే సుందరానికి. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతమందించారు. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, గ్లిమ్స్, లిరికల్ సాంగ్స్ ను బట్టి ఈ సినిమా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనే సున్నితమైన కాన్సెప్ట్ ను కామెడీ జోనర్ లో చూపించబోతున్నట్టు తెలుస్తుంది. మూవీ టీం మొదటి నుండి విభిన్నంగా ప్రమోషన్స్ చేసుకుంటూ వచ్చింది. దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు , సోషల్ మీడియా చిట్ చాట్ లు అనే తేడా లేకుండా వరస పెట్టి మూవీని ప్రోమోట్ చేస్తున్న నాని, నజ్రియా తాజాగా మూవీలోని ఒక పాటకు డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో లో నాని సతీమణి అంజన, నాని, నజ్రియా ముగ్గురు కలిసి డాన్స్ చేస్తారు. నాని భార్య అంజనా కు సంబంధించి ఇలాంటి వీడియో బయటకు రావడం ఇదే మొదటిసారి. చూస్తుంటే డీజే టిల్లు ను తలపిస్తున్న అంజనా డాన్స్ మాత్రం ఇరగదీసింది. ఈ వీడియోను నజ్రియా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. సుందరం, లీలాల ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చివరికి ఎలాంటి ముగింపు తీసుకుంది ? నానికున్న అరుదైన సమస్యేమిటి? తెలుసుకోవాలంటే ఇంకొన్ని గంటలు ఎదురు చూడక తప్పదు.