విశ్వనటుడు కమల్ హాసన్ ప్రస్తుతం విక్రమ్ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. చాన్నాళ్ల తర్వాత తన స్టామినా ఏంటో ఈ సినిమాతో బాక్సాఫీస్ కు రుచి చూపించారు కమల్. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ బ్యానర్ పై కమల్ హాసన్ నిర్మించి, నటించిన చిత్రం విక్రమ్. లోకేష్ కనగరాజ్ డైరెక్టర్. అనిరుద్ సంగీతమందిచారు. విలక్షణ నటులు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించగా, హీరో సూర్య అతిధి పాత్రను పోషించారు. సౌత్, నార్త్, ఓవర్సీస్ అనే తేడా లేకుండా విజయ ఢంకా మోగిస్తున్న ఈ మూవీ తాజాగా సక్సెస్ మీట్ ను జరుపుకుంది. ఇందులో పాల్గొన్న కమల్ ఇంటరెస్టింగ్ విషయాలను వెల్లడించారు. మధ్యలో ఆగిపోయిన తన గత చిత్రాల గురించి మాట్లాడుతూ... ఇంటరెస్ట్ ఉన్న వారెవరైనా తనతో చేతులు కలిపితే వాటిని తిరిగి పట్టాలెక్కిస్తానని చెప్పారు. అలానే గతంలో రజినీకాంత్, లోకేష్ కనగరాజన్ కాంబోలో కమల్ మూవీ చేయబోతున్నట్టు వచ్చిన వార్తలపై కూడా కమల్ స్పందించారు. సూపర్ స్టార్ రజినీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి తానెప్పుడూ సిద్ధమే అని తెలిపారు. కానీ అందుకు మంచి స్క్రిప్ట్ తప్పనిసరి అని కండిషన్ పెట్టారు. మంచి కథతో ఏ డైరెక్టర్ అయినా కమల్ ను అప్రోచ్ అయితే కమల్ - రజిని ల కాంబోలో మూవీ ఫ్యూచర్ లో రావచ్చేమో! ఎవరికీ తెలుసు?