మేకప్ మ్యాన్ గా కెరీర్ స్టార్ట్ చేసి, అనుష్క నటించిన పంచాక్షరి సినిమాతో నిర్మాతగా మారాడు బొమ్మదేవర రామచంద్రరావు. 12 సంవత్సరాల క్రితం పంచాక్షరి సినిమాను నిర్మించిన రామచంద్రరావు తాజాగా డైరెక్టర్ అవతారమెత్తారు. తన కొడుకు తేజ్ బొమ్మదేవర ను హీరోగా పరిచయం చేస్తూ రామచంద్రరావు ఒక సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాత కూడా ఆయనే. పూజా కార్యక్రమాలతో ఈ రోజే లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి యంగ్ హీరో నాగ చైతన్య చీఫ్ గెస్ట్ గా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. రేపటి నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. రిషిక లోక్రే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి వికాస్ బడిశె సంగీతం అందిస్తున్నారు. వాసు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. శరవేగంగా షూటింగును, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి ఈ ఏడాది సెప్టెంబర్ లో సినిమాను విడుదల చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.