బాలీవుడ్ స్టార్ హీరోయిన్, అనిల్ కపూర్ నటవారసురాలు సోనమ్ కపూర్ గర్భం దాల్చిన విషయం తెలిసిందే. భర్త ఆనంద్ అహుజా ఒడిలో సేద తీరుతూ దిగిన ఫొటోల్ని పోస్ట్ చేసి నేను నాలుగు నెలల గర్భవతినంటూ ఇంస్టా వేదికగా రెండ్నెల్ల క్రితం తన అభిమానులకు సోనమ్ ఈ గుడ్ న్యూస్ షేర్ చేసింది. ఆపై సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ, తన ప్రెగ్నెన్సీ కి సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులకు అప్డేట్ చేస్తూ వస్తుంది. ప్రస్తుతం భర్త ఆనంద్ అహుజాతో బేబిమూన్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తుంది. ఆమె తీయించుకున్న బేబీ బంప్ ఫోటో షూట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారడం పరిపాటి అయింది. తాజాగా సోనమ్ తీయుంచుకున్న గ్లామరస్ అండ్ స్టైలిష్ బేబి ఫోటోషూట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి. క్రీం కలర్ అవుట్ ఫిట్ తో మెరిసిపోయింది ఈ సావరియా హీరోయిన్. తన అందమైన ఔట్ ఫిట్ తో, ఎత్తైన బేబీ బంప్ తో కెమెరా కి ఫోజులిచ్చింది. తల్లి కాబోతున్న తన తోటివారికి ఈ ఫోటోషూట్ తో కొత్త సవాలును సోనమ్ విసిరింది. సోనమ్ ఈ సంవత్సరం ఆగస్టులో తన మొదటి బిడ్డకి జన్మనిచ్చే అవకాశముందని తెలుస్తుంది.