ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీ 5 ఓటిటిలో రానున్న మరో తెలుగు వెబ్ సిరీస్" రెక్కీ"

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 09, 2022, 10:12 PM

కరోనా పుణ్యమా అని ఓటిటీలు వెలుగులోకి వచ్చాయి. సినిమాలు, డాక్యుమెంటరీలు, వెబ్ సిరీస్ లు అనే తేడా లేకుండా సరికొత్త కంటెంట్ లతో తమ సబ్ స్క్రైబర్లను అలరించడానికి ఓటిటి సంస్థలు తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఈ నేపథ్యంలో జీ 5 ఓటిటి లో తెలుగు, తమిళం, హిందీ కన్నడం, మలయాళం వంటి భారతదేశ భాషల్లో వివిధ ఫార్మాట్ లలో ఫ్రెష్ కంటెంట్ అందుబాటులోకొస్తుంది. ఇటీవలే గాలివాన అనే వెబ్ సిరీస్ తో అలరించిన జీ 5 ఓటిటిలో తాజాగా మరో తెలుగు వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవ్వడానికి రెడీ అవుతుంది. 


సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ పై కే వి శ్రీరామ్ నిర్మించిన వెబ్ సిరీస్ రెక్కీ. జూన్ 17 నుండి జీ 5 ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. గ్రామీణ ఫ్యాక్షన్ క్రైం డ్రామాగా రూపొందిన రెక్కీ 7 ఎపిసోడ్లుగా స్ట్రీమ్ అవనుంది. ఇందులో "రోజాపూలు" ఫేమ్ శ్రీరామ్, శివబాలాజీ, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజయ్యింది. 1990 ల బ్యాక్ డ్రాప్ లో నడిచిన క్రైం థ్రిల్లర్ గా రెక్కీ వెబ్ సిరీస్ ఉండనుందని తెలుస్తుంది. ఈ సిరీస్ కు పోలూరు కృష్ణ దర్శకత్వం వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com