హీరో మంచు విష్ణు నుండి చివరగా వచ్చిన చిత్రం మోసగాళ్లు. ఈ సినిమా పరాజయంతో చాలా కాలం విరామం తీసుకున్న విష్ణు, ఇషాన్ సూర్య డైరెక్షన్లో ఒక సినిమాను చేస్తున్నారు. ఈ మూవీ కి ఇంకా టైటిల్ లాక్ చెయ్యలేదు. అయితే ఈ సినిమాలో గాలి నాగేశ్వరరావు అనే పాత్రలో విష్ణు నటిస్తున్నాడు కాబట్టి అదే టైటిల్ గా పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇందులో విష్ణు సరసన పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. AVA ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీ కి సంబంధించి విష్ణు బిగ్ అప్డేట్ ఇచ్చారు. రేపు ఉదయం 9:32 నిమిషాలకు మూవీ టైటిల్ ఎనౌన్స్మెంట్ జరుగుతుందని అధికారికంగా ట్వీట్ చేసారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. కొనవెంకట్ ఈ సినిమాకు కథ - స్క్రీన్ ప్లే అందించడమే కాక క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించారు.