నాచురల్ స్టార్ నాని నటించిన కొత్త చిత్రం 'అంటే సుందరానికి'. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో మలయాళ ముద్దుగుమ్మ నజ్రియానాజిమ్ హీరోయిన్ గా నటించింది. వివేక్ సాగర్ సంగీతమందించిన ఈ చిత్రం జూన్ 10న అంటే రేపు విడుదల కాబోతుంది.
తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చారు. ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడ్తూ... అంటే సుందరానికి సినిమాకి నన్ను ఆహ్వానించనందుకు నిర్మాతులుకి ధన్యవాదులు.. అలాగే నాని నటనే కాకుండా నాకు అయన వ్యక్తితం అంటే నాకు చాలా ఇష్టం. నానికి ఇంకా మంచి విజయాలు రావాలని తెలిపారు. నానికి మా ఇంట్లో చాలా మంది అభిమానులు ఉన్నారు అని పవన్ కళ్యాణ్ తెలిపారు. నజ్రియా మంచి నటి అని తెలిపారు. ఈ సినిమాలో నటించిన అందరి నటీనటులుకి అభినందులు తెలిపారు. వివేక్ సాగర్ ఈ సినిమాకి మంచి సంగీతం అందించారు అని తెలిపారు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కి అభినందులు తెలిపారు. ఇక తెలుగు చిత్రపరిశ్రమ ఒకరి సొత్తు కాదు ఇది అందరి సొత్తు అని పవన్ అన్నారు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలిన నిలబడే కలిగే గుండె ధైరం మీరు ఇచ్చారు..... తెలుగు చిత్రపరిశ్రమ ఇచ్చింది. తెలుగు చిత్రపరిశ్రమ మన అందరిది. తెలుగు చిత్రపరిశ్రమ రాజకీయ పరంగా విబిన్నగ ఆలోచనలు ఉండచ్చు కానీ సినిమా వేరు రాజకీయం వేరు ఆ స్పష్టత నాకు ఉంది. ఎందుకు అంటే ఇది 24 క్రాఫ్టులు కలిపితే వచ్చే సినిమా... చాలా మంది కళాకారులు వచ్చే కలిస్తే వచ్చే సినిమా. ఇక్కడ కులం మతం ప్రాంతాలు ఉండవు. అందుకే తెలుగు చిత్రపరిశ్రమ అంటే నాకు అపారమైన గౌరవం అని పవన్ అన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి పవన్ తెలిపారు. త్వరలో హరీష్ శంకర్ దర్శకత్వలో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా రాబోతుంది అని పవన్ తెలిపారు.