నాచురల్ స్టార్ నాని నటించిన కొత్త చిత్రం 'అంటే సుందరానికి'. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో మలయాళ ముద్దుగుమ్మ నజ్రియానాజిమ్ హీరోయిన్ గా నటించింది. వివేక్ సాగర్ సంగీతమందించిన ఈ చిత్రం జూన్ 10న అంటే రేపు విడుదల కాబోతుంది. ఈ ఈవెంట్‌లో హీరో నాని మాట్లాడుతూ..పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత హీరోలందరినీ కలిశాను. అయినా పవన్ కళ్యాణ్‌తో మాట్లాడే అవకాశం నాకు రాలేదు. ఈ 14 ఏళ్ల సినీ కెరీర్‌లో ఆయన్ను ఎప్పుడూ కలవలేదు.కానీ పవన్ కళ్యాణ్‌తో చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ఈరోజు ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ రావడం చాలా సంతోషంగా ఉందని.. అందుకు ఆయనకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా కోసం అందరూ కూడా చాలా కష్టపడ్డారు అని నాని తెలిపారు.