'కుమారి 21ఎఫ్' సినిమాతో హిట్ కొట్టిన డస్కీ బ్యూటీ హెబ్బా పటేల్ ఇప్పుడు వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ ZEE5 కోసం ఈ బ్యూటీ ఒక సిరీస్ చేస్తున్నట్లు సమాచారం. 'ది బ్లాక్ కోట్' అనే టైటిల్ ని ఈ వెబ్ సిరీస్ కి లాక్ చేసారు. ఈ సిరీస్ లో C/o కంచరపాలెం సినిమాలో నటించిన కార్తీక్ రత్నం మరియు కామ్నా జెఠ్మలానీ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజగా ZEE5 ఈ సిరీస్‌ని ప్రకటించింది కానీ దర్శకుడు, నిర్మాత మరియు ప్రధాన పాత్రలు పోషిస్తున్న వారి వివరాలను ఇంకా ప్రకటించలేదు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa