చలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి కుర్రాళ్ళ గుండెల్ని దోచేసుకున్న రష్మిక మందాన గీత గోవిందం సినిమాతో తెలుగులో బిజీగా మారిపోయింది. ఇప్పటికే నాగార్జున-నానీ మల్టీస్టారర్ దేవదాస్, విజయ్ దేవరకొండతోనే మరో సినిమా డియర్ కామ్రేడ్ అనే సినిమాలు చేస్తుండగా మరో రెండు సినిమాలు చర్చలలో ఉన్నాయి. అయితే కన్నడ సినిమా కిరాక్ పార్టీ చేస్తున్న సమయంలోనే ఆ సినిమా హీరో రక్షిత్ తో ప్రేమలో పడిందని వార్తలొచ్చాయి. త్వరలోనే పెళ్లి కూడా ఉంటుందని చెప్పారు. అయితే తెలుగులో బిజీ కావడంతో ఈమధ్య కాలంలో కాస్త సైలెంట్ ఉండడంతో పెళ్లి ఇక లేనట్లే అని వార్తలొచ్చాయి. ఇప్పటివరకు ఆ వార్తలను పట్టించుకోని రష్మిక ఇప్పుడు ఒక క్లారిటీ ఇచ్చేసింది. నిశ్చతార్ధం ఎప్పుడో జరిగిపోయిందని పెళ్ళికి ఇంకా టైం ఉందని.. ఏది ఏమైనా రక్షిత్ తోనే తన పెళ్లి ఉంటుందని చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa