టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందు మొండేటి దర్శకత్వం వహించిన సినిమా కార్తికేయ. 2014లో వచ్చిన ఈ సినిమా నిఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ పై మొదటినుండి మంచి అంచనాలు నెలకొన్నాయి. కార్తికేయ 2 సినిమా ఎప్పుడో మొదలైంది కానీ కోవిడ్ వల్ల ఈ మూవీ షూటింగ్ పలు మార్లు వాయిదాపడింది. భారతదేశపు తొలి మిస్టికల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ఈ సినిమా జులై 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల విడుదల చేసిన మోషన్ పోస్టర్ కు, ముఖ్యపాత్రల పరిచయ వీడియోకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.
తాజాగా ఈరోజు మేకర్స్ సరికొత్త అప్డేట్ ఇచ్చారు. కార్తికేయ 2 టీజర్ ను జూన్ 24న రిలీజ్ చెయ్యబోతున్నట్టు తెలిపే ఒక వీడియోను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసారు. టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్, వైవా హర్ష, శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa