ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్ప. బన్నీ సరసన రష్మిక మండన్నా హీరోయిన్గా నటించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ గతేడాదిలో విడుదలై, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పాన్ ఇండియా ఇమేజ్ ను తెచ్చిపెట్టిన ఈ మూవీకి సీక్వెల్ చెయ్యాలనే అత్యుత్సహంతో బన్నీ ఇతర ప్రాజెక్టులకు కమిటవ్వకుండా పుష్ప 2 కోసం వేచి చూస్తున్నాడు. చాన్నాళ్ల నుండి ఈ మూవీపై పలురకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. వాటిలో రష్మిక రోల్ కి సంబంధించిన న్యూస్ మాత్రం హాట్ టాపిక్ గా నిలిచింది. అదేంటంటే, పుష్ప 2లో శ్రీవల్లి పాత్రకు ట్రాజెడీ ఎండింగ్ ఇస్తే, ప్రేక్షకులను ఎమోషనల్ గా టచ్ చెయ్యొచ్చని, ఆ ఎపిసోడ్ సినిమాకు మెయిన్ హై లైట్ గా నిలుస్తుందని, ఆ విధంగా సుకుమార్ స్క్రిప్ట్ ను రెడీ చేసారని అంటున్నారు. తాజాగా ఈ వార్తలపై పుష్ప నిర్మాత వై. రవి శంకర్ మాట్లాడుతూ... ఈ వార్తలన్నీ కేవలం పుకార్లే అని కొట్టిపారేశారు. పుష్ప 1 లో చెంగుచెంగున తిరిగిన అల్లరి శ్రీవల్లి సీక్వెల్ లో లేట్ శ్రీవల్లిగా మారబోతుందనే వార్తలో ఎటువంటి నిజం లేదని తేల్చిచెప్పేశారు. దీంతో రష్మిక అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa