ప్రముఖ సినీ నేపథ్య గాయని చిన్మయి శ్రీపాద కవలలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త, సినీ హీరో రాహుల్ రవీంద్ర మంగళవారం రాత్రి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. వారిలో ఒకరికి ద్రిప్తి, మరొకరికి శర్వాస్ అనే పేర్లు పెట్టారు. మా కొత్త ప్రపంచంలోకి వచ్చి, మాతోనే ఉండిపోయే అతిథులు అంటూ క్యాప్షన్ జోడించారు. పలువురు సినీ ప్రముఖులు చిన్మయి-రాహుల్ రవీంద్ర జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.