టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని త్వరలోనే వెండితెరపై వారియర్ గా కనిపించి అలరించనున్నాడు. కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి డైరెక్షన్లో పక్కా కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో రామ్ సరసన కృతిశెట్టి, అక్షర గౌడ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషలలో రూపొందుతున్న ఈ మూవీని శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో బుల్లెట్, దడ దడ అనే లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా సినిమా నుండి మూడో లిరికల్ సాంగ్ "విజిల్" ను విడుదల చేసారు. హైదరాబాద్ లోని AMB సినిమాస్ హాల్ లో, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చేతులమీదుగా డిజిటల్ రిలీజ్ ఐన ఈ పాట మంచి పెప్పి నెంబర్ గా ఉంది. దేవిశ్రీప్రసాద్ ఎనర్జిటిక్ మ్యూజిక్ కు, రామ్,కృతిల మాస్ స్టెప్పులు కలిసిన ఈ పాట చార్ట్ బస్టర్ అవ్వడం ఖాయమనిపిస్తుంది. ఈ పాటను ఆంథోనీ దాసన్, శ్రీనిష ఆలపించారు.
ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్గా, నదియా ముఖ్యపాత్రలో నటించనున్నారు. జూలై 14వ తేదీన ఈ సినిమా విడుదలవడానికి రెడీ అవుతుంది.
![]() |
![]() |