స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద, నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ జంటకు కవలలు జన్మించారు. 2014 లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తల్లితండ్రులయ్యారు. ఈ మధురక్షణాలను చిన్మయి, రాహుల్ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులకు తెలియచేసారు. పలువురు సెలెబ్రిటీలు, సింగర్లు, అభిమానులు వారికి శుభాకాంక్షలను తెలియచేస్తున్నారు. కానీ, కొంతమంది నెటిజన్లు మాత్రం చిన్మయి ప్రెగ్నెన్సీ పై అభ్యంతరకరంగా కామెంట్లు పెడుతున్నారు. దీనిపై స్పందించిన చిన్మయి ఎవరైతే ఇలాంటి మెసేజ్ లను తనకు సెండ్ చేస్తున్నారో వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
" ప్రెగ్నన్సీ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యకపోవడంతో చాలామంది నేను సరోగేట్ పద్దతిలో తల్లినయ్యానని అనుకుంటున్నారు. ఈ విషయంపై నాకు డైరెక్ట్ మెసేజ్ లు పెడుతున్న వారందరిని నేను ప్రేమిస్తున్నాను. నా వ్యక్తిగత జీవితాన్ని చాలా ప్రైవేట్ గా ఉంచాలనుకునే వ్యక్తిని నేను. నేను బాగా తెలిసిన వారికి తెలుసు నేను సరోగసీ ద్వారా తల్లినయ్యానా? లేక ప్రెగ్నెన్సీనా?అనేది. నా పిల్లల ఫోటోలను ఇప్పుడప్పుడే సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యటం జరగదు. అంతగా నా ప్రెగ్నెన్సీ గురించి మీరు తెలుసుకోవాలంటే ఒక విషయం చెప్తాను.... డాక్టర్లు నాకు సిజేరియన్ చేస్తున్నప్పుడు నేను భజన పాటలు పడుతున్నాను. ఈ విషయంపై మరిన్ని విషయాలు త్వరలోనే అందరికి తెలియచేస్తాను"... అని పోస్ట్ చేసింది. దీంతో చిన్మయి అభిమానులు సోషల్ మీడియాలో ట్రోలర్స్ కు గట్టిగా బుద్ధి చెప్తున్నారు. ఆమె సరోగసి ద్వారా పిల్లల్ని కంటే మీకెందుకు? గర్భం ధరిస్తే మీకెందుకు? సరోగసి విధానం తప్పేమి కాదే? ఇది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం... అని ట్రోలర్స్ కు చెక్ పెడుతున్నారు.
![]() |
![]() |