ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశ్వక్ - అర్జున్ సినిమా ప్రారంభం... పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్!

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 23, 2022, 10:19 AM

సీనియర్ హీరో అర్జున్ దర్శకనిర్మాణంలో, ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్ టాలీవుడ్ కు పరిచయమవుతున్న విషయం తెలిసిందే కదా. ఈ  సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నారు. సీనియర్ హీరో జగపతిబాబు కీ రోల్ ప్లే చేస్తున్నారు. శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై అర్జున్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం అధికారికంగా ప్రకటింపబడిన ఈ చిత్రం ఈరోజు పూజాకార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో జరిగిన ఈ మూవీ పూజా కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలను తెలియచేసారు. పవన్ రాకతో ఇప్పుడు ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది. ఈ కార్యక్రమంలో అర్జున్, విశ్వక్ సేన్, జగపతి బాబు తదితరులు పాల్గొన్నారు.
ఈ సినిమాకు స్టార్ రైటర్ సాయిమాధవ్ బుర్రా రచయితగా, రవి బసృర్ మ్యూజిక్ డైరెక్టర్ గా, నీరజ కోనా కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తున్నారు. సినిమా ఎనౌన్స్మెంట్ నుండి వరస సర్ప్రైజింగ్ అప్డేట్లనిస్తున్న ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెలువడనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com