ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండవ తనయుడు గణేష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం "స్వాతిముత్యం". గణేష్ సరసన యువనటి వర్ష బొల్లమ్మ నాయికగా నటిస్తుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మహతీ స్వరసాగర్ సంగీతమందించిన ఈ మూవీ ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజాగా మేకర్స్ ఈ మూవీ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసారు. నీ చారెడు కళ్ళే అనే సాంగ్ నుండి రిలీజైన ఈ ప్రోమో హీరోహీరోయిన్ల మధ్య సాగే ప్రేమ గీతంగా ఉండనున్నట్టు తెలుస్తుంది. ఈ పాటను అర్మాన్ మాలిక్, సంజనా ఆలపించగా, కృష్ణ కాంత్ లిరిక్స్ అందించారు. పూర్తి పాటను జూన్ 27న విడుదల చెయనున్నట్టు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa