జూలై 1వ తేదీన విడుదల కాబోతున్న గోపీచంద్ కొత్త చిత్రం పక్కా కమర్షియల్, తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. సెన్సార్ బృందం ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. రెండుగంటల ముప్పై రెండు నిమిషాల నిడివితో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యింది.
మారుతి డైరెక్షన్లో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో రాశిఖన్నా హీరోయిన్ గా నటించింది. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జెక్స్ బిజోయ్ సంగీతం అందించారు.