టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో గీతా ఆర్ట్స్ ఒకటి. 1972లో అల్లు అరవింద్ నిర్మించిన ఈ సంస్థకు క్రమేపి నాలుగైదు అనుబంధ సంస్థలు కూడా ఏర్పడ్డాయి. అల్లుఅరవింద్ బన్నీ వాసు తో చేతులు కలిపి మొదలుపెట్టిన నిర్మాణ సంస్థ "గీతా ఆర్ట్స్ 2". ఈ నిర్మాణ సంస్థలో భలే భలే మగాడివోయ్, గీతాగోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే,చావుకబురు చల్లగా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రీసెంట్గా పక్కా కమర్షియల్ వంటి మీడియం బడ్జెట్ సినిమాలు తెరకెక్కాయి.
తాజాగా గీతా ఆర్ట్స్ 2 లో ప్రొడక్షన్ నెం. 8 గా ఒక కొత్త మూవీ ఎనౌన్స్మెంట్ జరిగింది. ఈరోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమాకు బన్నీ వాసు నిర్మాతగా, అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. తేజమర్ని అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో హీరో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ మురళీశర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మిగిలిన విషయాలు త్వరలోనే వెలువడనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa