చిత్రసీమలో చిరకాల స్నేహితులు, శత్రువులు ఉండరని ఒక సూక్తి ఉంటుంది. కానీ, వర్షం (2004) సినిమా అప్పటినుండి సన్నిహితంగా మెలుగుతున్నారు ఆ సినిమాలో హీరో విలన్ వేషాలను వేసిన ప్రభాస్, గోపీచంద్. మీడియా ముందు ఎక్కువగా బయటపడిని వీరి స్నేహం చాలా ప్రత్యేకమని తెలుస్తుంది. గోపీచంద్ సినిమాలకు ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా వెళ్లడం, స్టైల్ అండ్ కాస్ట్యూమ్స్ విషయంలో సలహాలు ఇవ్వడం వంటివి వీరిద్దరూ ఎంత క్లోజో తెలియచేస్తుంది.
తాజాగా మరొక ఇన్సిడెంట్ ప్రభాస్, గోపీచంద్ ల చిరకాల స్నేహానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గోపీచంద్ కొత్త సినిమా "పక్కా కమర్షియల్" ఈ రోజు విడుదల కాబోతుండడంతో, డార్లింగ్ ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక స్పెషల్ నోట్ ను షేర్ చేసాడు. తన బెస్ట్ ఫ్రెండ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ పక్కా కమర్షియల్ చిత్రబృందానికి పేరుపేరునా ప్రభాస్ శుభాకాంక్షలను తెలియచేసారు. ప్రభాస్ ప్రచారం చెయ్యడంతో ఈ సినిమా మరింత హైప్ తెచ్చుకుంది.