సీనియర్ నటుడు నరేశ్, నటి పవిత్రా లోకేశ్ మధ్య సంబంధం గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదే అంశంపై శుక్రవారం పవిత్ర లోకేశ్ స్పందించారు. నరేశ్ భార్యనంటూ వచ్చిన రమ్య బెంగళూరులో మీడియాలో తనపై చాలా చెడుగా మాట్లాడిందని వాపోయారు. ఈ పరిణామాలతో తాను తీవ్ర మనస్తాపానికి గురవుతున్నానని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయంలో తమకు మద్దతుగా నిలవాలని పవిత్ర లోకేశ్ విజ్ఞప్తి చేశారు