సర్కారువారిపాట సినిమా తర్వాత మహేష్ త్రివిక్రం తో సినిమా చెయ్యబోతున్నాడన్న విషయం తెలిసిందే. మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీలో పూజాహెగ్డే హీరోయిన్ కాగా, తమన్ బాణీలందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన, పూజా కార్యక్రమం గతంలోనే పూర్తవ్వగా, రెగ్యులర్ షూటింగ్ మొదలుకావాల్సి ఉంది.
వెకేషన్ పూర్తి చేసుకుని ఈ మధ్యనే ఇండియాకు తిరిగొచ్చిన సూపర్ స్టార్ కు త్రివిక్రమ్ తన ఫైనల్ స్క్రిప్ట్ ను వినిపించాడట. మాటల మాంత్రికుడి మతిపోయే స్క్రిప్ట్ కు మహేష్ చాలా హ్యాప్పీగా ఫీల్ అవుతున్నాడట. దీంతో ఎప్పుడెప్పుడు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేద్దామా అని ఎదురుచూస్తున్నాడట. ఆల్రెడీ తమన్ ఈ ప్రాజెక్ట్ పై వర్క్ స్టార్ట్ చేసాడని టాక్.