ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పొన్నియిన్ సెల్వన్: ఆకట్టుకుంటున్న విక్రమ్ ఫస్ట్ లుక్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 04, 2022, 01:38 PM

భారతదేశ దిగ్గజ దర్శకులలో ఒకరైన మణిరత్నం తన డ్రీం ప్రాజెక్ట్ అని ప్రకటించిన "పొన్నియిన్ సెల్వన్" నుండి చియాన్ విక్రమ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. చోళ యువరాజు ఆదిత్య కరికలన్ పాత్రలో విక్రమ్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఈయనెవరో కాదు రాజ రాజ చోళుడిగా ప్రసిద్ధి పొందిన అరుళ్మోజివర్మన్ కు పెద్దన్నయ్య. అంతేకాక, చోళరాజ్యానికి ఉత్తర సేనాధిపతి.
తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ లో రణరంగంలో విజయోత్సాహంతో గర్వంగా తలపైకెగరేస్తున్న విక్రమ్ మనకు కనిపిస్తాడు. ఈ ఒక్క పోస్టర్ తోనే ఈ సినిమాలో విక్రమ్ ఎంతటి పవర్ఫుల్ రోల్ లో నటించాడో తెలుస్తుంది. 
చియాన్ విక్రమ్,ఐశ్వర్యా రాయ్, కార్తీ, జయం రవి, త్రిష ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిస్టారికల్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మణిరత్నం కో ప్రొడ్యూసరుగా వ్యవహరిస్తున్నారు. రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం మొదటి భాగం సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com