కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ తొలిసారి మెగాఫోన్ పట్టి డైరెక్ట్ చేసిన చిత్రం రాకెట్రి: ది నంబి ఎఫెక్ట్ . జూలై 1వ తేదీన విడుదలైన ఈ చిత్రం డీసెంట్ టాక్ తో సక్సెస్ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతుంది.
ఇండియాలో స్పేస్ రీసెర్చ్ అభివృద్ధి కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొని, తన జీవితాన్ని సైతం త్యాగం చేసిన పద్మ భూషణ్ నంబి నారాయణన్ బయోపిక్ ను మాధవన్ సినిమాగా రూపొందించడం పట్ల సూపర్ స్టార్ రజినీకాంత్ చాలా గర్వంగా ఫీల్ అయ్యారు. రాకెట్రి సినిమాను చూసిన రజిని తన ట్విట్టర్ హ్యాండిల్ లో మాధవన్ ను ఒక రేంజులో పొగిడేస్తూ ఒక స్పెషల్ నోట్ ను పోస్ట్ చేసారు. రాకెట్రి సినిమా దేశ యువత తప్పకుండా చూడాల్సిన సినిమా అని పేర్కొన్నారు. తొలి సినిమాతోనే మాధవన్ ది బెస్ట్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్నారని చెప్పారు.
హిందీలో షారుఖ్ ఖాన్, తమిళ్, తెలుగులో హీరో సూర్య పోషించిన క్యామియో రోల్స్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ట్రై కలర్ ఫిలిమ్స్, వర్ఘిస్ మూలాన్ పిక్చర్స్, 27th ఇన్వెస్ట్మెంట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.