నేచురల్ స్టార్ హీరో నాని, హీరోయిన్ నజ్రియా కలిసి నటించిన సినిమా 'అంటే సుందరానికీ'. ఈ సినిమా మంచి హిట్ టాక్ ను తెచ్చుకుంది. జూన్ 10వ తేదిన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నెల రోజుల వ్యవధిలోనే నెట్ ఫ్లిక్స్ లోకి అడుగుపెడుతోంది. తెలుగు, తమిళం, మలయాళంలో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం చేయగా మైత్రీ మూవీస్ సినిమాను నిర్మించింది.