ట్రెండింగ్
Epaper    English    தமிழ்

#RC15: పంజాబ్లోచెర్రీపై కాలేజీ పాటను చిత్రీకరిస్తున్న శంకర్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 04, 2022, 12:52 PM

ఆర్ ఆర్ ఆర్ తదుపరి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఫేమస్ డైరెక్టర్ శంకర్ తో సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. RC15 అని పిలవబడుతున్న ఈ మూవీ దాదాపు ఒక నెల విరామం తర్వాత గత శుక్రవారం నుండి కొత్త షెడ్యూల్ జరుపుకుంటుంది. పంజాబ్ లోని కొన్ని లొకేషన్స్ లో షూటింగ్ కు అనుమతి ఇవ్వకపోవడంతో ఇంత జాప్యం జరిగిందట. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ పై కాలేజీ బ్యాక్ గ్రౌండ్ లో ఒక లావిష్ పాటను చిత్రీకరిస్తున్నారట. ఈ పాటకు బాలీవుడ్ స్టార్ కంపోజర్ గణేష్ ఆచార్య కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఇవాళ, రేపట్లో ఈ పాట చిత్రీకరణ పూర్తవుతుందట. తదుపరి హైదరాబాద్ లో మరో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చెయ్యనుంది RC15 మూవీ టీం. కొత్త షెడ్యూల్ లో కియారా అద్వానీ, విలన్ పాత్ర పోషిస్తున్న sj సూర్య తదితర కీలక పాత్రధారులు పాల్గొంటారంట.
ఈ మూవీలో అంజలి, సునీల్, జయరాం, నవీన్ చంద్ర, వెన్నెల కిషోర్, ప్రియదర్శి కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com