తమిళ సూపర్‌స్టార్ విజయ్ సరసన బీస్ట్ చిత్రంలో నటించిన తర్వాత పూజా హెగ్డే సూర్యతో జతకట్టే అవకాశం ఉంది. ‘ తెలుగు, బాలీవుడ్ లలో ఆమెకున్న ఆదరణతో కోలీవుడ్ లో ఆమెకు భారీ ఆఫర్లు వస్తున్నాయి.చాలా రోజుల క్రితమే శివ దర్శకత్వంలో ఓ సినిమాని ఎనౌన్స్ చేశాడు సూర్య. అయితే ఇటీవల రజనీకాంత్‌తో శివ తీసిన సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆ దర్శకుడి క్రేజ్ పోయింది. కానీ సూర్య ఈ ప్రాజెక్ట్‌ను పునరుద్ధరించనున్నాడని మరియు పూజా హెగ్డేని పరిశీలిస్తున్నట్లు సమాచారం.పూజా హెగ్డే చేతిలో తెలుగు, బాలీవుడ్ బిగ్గెస్‌లు ఉన్నాయి.ప్రస్తుతం ఆమె సల్మాన్ ఖాన్ సరసన ఓ బాలీవుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తోంది. ఆమె త్వరలో మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ సినిమా కోసం తన పనిని ప్రారంభించనుంది.