విప్లవ సినిమాలు, ప్రజలను చైతన్యపరిచే సినిమాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి. తాను డైరెక్ట్ చేసిన సినిమాలకు గాను పలు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను అందుకున్న నారాయణమూర్తికి 68 ఏళ్ళ వయసులో మాతృవియోగం కలిగింది. నారాయణమూర్తి మాతృమూర్తి చిట్టెమ్మ గారు అనారోగ్య సమస్యల కారణంగా ఈరోజు ఉదయం చివరి శ్వాసను వదిలారు. 93ఏళ్ళ వృద్ధ వయసులో చిట్టెమ్మ మరణించడం, బ్రహ్మచారిగా ఉన్న నారాయణమూర్తి జీవితంలో చాలా పెద్ద నష్టమనే చెప్పాలి. తూర్పు గోదావరి జిల్లా, రౌతుల పూడి మండలం, మల్లం పేట లో ఉంటున్న చిట్టెమ్మకు అక్కడే ఈరోజూ సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ విషాదం పట్ల పలువురు సినీ పెద్దలు, నటీనటులు నారాయణమూర్తికి సానుభూతి తెలియచేస్తున్నారు.