అక్కినేని వారసుడు అఖిల్ కెరీర్లో తొలిసారి భారీ బడ్జెట్ తో నిర్మింపబడుతున్న చిత్రం "ఏజెంట్". సురేందర్ రెడ్డి డైరెక్షన్లో సూపర్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాక్షివైద్య అనే కొత్తమ్మాయి హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుండి కనీసం టీజర్ కూడా రిలీజ్ అవ్వలేదు. కేవలం పోస్టర్లతోనే సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అవ్వడం నిజంగా గ్రేట్.
పోతే.., ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 12న ఎజెంట్ ను విడుదల చేస్తామని మేకర్స్ గతంలోనే ప్రకటించారు. కానీ, ఈ విడుదల తేదీ కాస్తా వాయిదా పడబోతుందని తెలుస్తుంది. ఎందుకంటే, ఏజెంట్ షూటింగ్ ఇంకా చాలా ఉంది. ఈ లోపు సురేందర్ రెడ్డి కోవిడ్ కు గురి కావడం, ఆ డేట్స్ ను మమ్ముట్టి బుడాపెస్ట్ కు వినియోగించడం... ఇలా ప్రతీది ఈ సినిమా ఆలస్యానికి కారణం అవుతుంది. మమ్ముట్టి కొత్త డేట్స్ ను ఏజెంట్ కోసం సర్దుబాటు చేస్తే, అప్పుడు కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. తదుపరి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగాలి. దీంతో దసరాకు వాయిదా పడుతుందనుకున్న ఏజెంట్ మూవీ ఏకంగా డిసెంబర్ నెలకు వాయిదా పడింది. ఈ మేరకు త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన చేయనున్నారట.