"ఉప్పెన" చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది. ముంబాయి భామ కృతిశెట్టి. తొలి సినిమాతోనే అద్భుత విజయం సొంతం చేసుకుంది. ఈ ఏడాది -శ్యామ్ సింగరాయ్" "బంగార్రాజు తో తెరపైకి వచ్చింది. తాజాగా హీరో రామ్ సరసన "ది వారియర్ లోనూ నటించింది. తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 14న ఈ సినిమా విడుదలకు సిద్ధమవు, తుంది. ఈ నేపథ్యంలో షూటింగ్ ముచ్చట్లు చెప్పుకొచ్చింది కృతిపెట్టి , "తొలిసారి యాక్షన్ సినిమాలో నటించడం త్రిల్లింగ్ గా ఉంది. ఇందులో నా పాత్ర కొత్తగా ఉంటుంది. ఈ కథ చెప్పిన వెంటనే బాగా నచ్చింది. అందుకే ఓకే చేశా, హీరో రామ్ ఎనరీని మ్యాచ్ చేయాలంటే కష్టం..కానీ షూటింగ్ మొదలైన తర్వాత చాలా ఎంజాయ్ చేశా. ఎక్స్ ట్రా ఎనర్జీ కావాలనుకున్నప్పుడు ఈ మూవీలోని 'విజిల్' సాంగ్ పెట్టుకుని డ్యాన్స్ చేసేదాన్ని " అని "ది వారియర్' మూవీ ముచ్చట్లు చెప్పింది ముంబాయి భామ.