దర్శకధీరుడు రాజమౌళి తండ్రి, ఫేమస్ సీనియర్ స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎంపికయ్యారు. ఈ మేరకు బీజేపీ ప్రభుత్వం నిన్న సాయంత్రం అధికారిక ప్రకటన చేసింది. ఈ విషయం పట్ల విజయేంద్ర ప్రసాద్ స్పందన చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు.
రాజ్యసభకు నామినేట్ అవ్వడం పట్ల మీ స్పందన ఏంటి ? అని విజయేంద్రప్రసాద్ ను మీడియా అడగ్గా... ఆయన ఆశ్చర్యకర సమాధానం విని మీడియా విస్తుపోయింది. "ఇది చాలా సహజమైన విషయం... ఇక నాకు నిద్రొస్తుంది" అని ఎంతో హుందాగా, చాలా కూల్ గా సమాధానం ఇచ్చారు. వేరొకరైతే ఇప్పటికి సెలెబ్రేషన్స్, ఇంటర్వ్యూలు అంటూ తెగ హంగామా చేస్తారు. కానీ, విజయేంద్ర ప్రసాద్ ఇంత సింపుల్ గా, ఎప్పుడూ ఉన్నట్టుగానే ఉండడం నిజంగా గ్రేట్... రాజమౌళి కూడా తండ్రి లాగానే ఎంత గొప్ప విజయం సాధించినా, దాన్ని తలకెక్కించుకోకుండా చాలా హుంబుల్ గా ఉంటారు. తండ్రి లాగానే కొడుకు... అని కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.