టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్, 'PSV గరుడవేగ' ఫేమ్ ప్రవీణ్ సత్తారు, కింగ్ నాగార్జున కాంబినేషన్లో రాబోతున్న కొత్త చిత్రం ఘోస్ట్. ఇందులో సోనాల్ చౌహన్ హీరోయిన్. ఈ మూవీలో హీరోహీరోయిన్లు ఇంటర్పోల్ ఆఫీసర్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లిమ్ప్స్ ను బట్టి, ఈ సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ రోల్ లో నాగార్జున విశ్వరూపం చూపిస్తారని అర్ధమవుతుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్పీ , నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నారాయణ్ కె దాస్ నారంగ్, శరత్ మరార్, సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మూవీ నుండి ఫస్ట్ విజువల్స్ ను జూలై 9వ తేదీన విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ కొంచెంసేపటి క్రితమే అధికారిక పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ లో నాగ్ లుక్ చాలా కూల్ గా, స్టైలిష్ గా ఉంది.