ఈమధ్యకాలంలో సోషల్ మీడియా ఎంతటి పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సెలెబ్రిటీలతో పాటు సామాన్య ప్రజలు సైతం సోషల్ మీడియాలో తమ ప్రతిభతో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుంటున్నారు. అత్యధిక ఫాలోవర్లున్న సినీ సెలెబ్రిటీలలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఒకరు. ట్విట్టర్ లో 3.9 మిలియన్ల మంది ఫాలోవర్లతో ఉన్న విజయ్ త్వరలోనే మరో సోషల్ మీడియా రంగమైన ఇంస్టాగ్రామ్ లో ఎంటర్ ఇవ్వబోతున్నారు. ఈ మేరకు @actorvijay అనే ఖాతా ఒకటి ఇంస్టాగ్రామ్ లో మనకు దర్శనమిస్తుంది. జీరో ఫాలోవర్లు, జీరో ఫాలోయింగ్ తో ఉన్న ఈ ఎకౌంట్ ప్రస్తుతం ప్రైవేట్ లో ఉంది. ఈ ఖాతా హీరో విజయ్ దే అని, త్వరలోనే ఈ ఎకౌంట్ తో విజయ్ అభిమానులతో టచ్ లోకొస్తారని తెలుస్తుంది.