'మజిలీ' ఫేమ్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఒక అందమైన ప్రేమకథ "ఖుషి"లో, రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత లీడ్ పెయిర్ గా నటిస్తున్నారు. 'మహానటి' చిత్రంలో కొద్దిసేపు ప్రేమపక్షుల్లా కనిపించి ఆడియన్స్ ను మురిపించిన విజయ్- సమంత లు ఈ చిత్రం లో పూర్తి నిడివిలో జంటగా కనిపిస్తుండటంతో ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 23న ఖుషి చిత్రం విడుదల కానుంది. ఇటీవల విడుదలైన 'ఖుషి' మూవీ టైటిల్ పోస్టర్ కు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.
కాశ్మీర్, హైదరాబాద్ లలో రెండు షెడ్యూల్స్ ను ముగించుకున్న ఖుషి చిత్రబృందం తాజాగా వైజాగ్ లో కొత్త షెడ్యూల్ ను ప్రారంభించబోతుంది. అక్కడి అందమైన సముద్ర తీరంలో విజయ్, సమంతలపై ఒక రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరించబోతున్నట్టు సమాచారం.